అల్లు అర్జున్‌‌కు హైకోర్టులో మధ్యంతర బెయిల్

అల్లు అర్జున్‌‌కు హైకోర్టులో మధ్యంతర బెయిల్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తరువాత హైకోర్టు అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు  చేస్తూ తీర్పిచ్చింది. రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా తెలంగాణ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 

అదే సమయంలో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై ఇవ్వడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పారు. క్వాష్ పిటిషన్‌ విచారణలో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు ఇదే కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ చంచల్‌గూడ జైలు లోపలికి వెళ్లిపోయారు. ఇప్పుడు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

  • ఈ కేసులో అల్లు అర్జున్‌పై పెట్టిన కొన్ని సెక్షన్లు వర్తించవన్న హైకోర్టు.
  • విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లోద్దని అల్లు అర్జున్‌కు కండిషన్.
  • కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..?
  • అల్లు అర్జున్ కు జీవించే హక్కు ఉంది.
  • రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేం: హైకోర్టు