
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వివాదస్పదంగా మారిన కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి (2025, ఏప్రిల్ 3) వరకు గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం చేపట్టిన పనులను ఆపేయాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ తదుపరి విచారణను బుధవారానికి (ఏప్రిల్ 3) వాయిదా వేసింది. కాగా, కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించి వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.
ALSO READ | కంచె గచ్చిబౌలి భూములపై నివేదికివ్వండి..తెలంగాణకు కేంద్రం ఆదేశం
ఈ భూమి మాదే అని ప్రభుత్వం.. కాదు మాదే అని యూనివర్శిటీ విద్యార్థులు అంటున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ భూములను ప్రభుత్వం చదును చేయిస్తోంది. దీంతో వర్శిటీ విద్యార్థులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో కంచె భూముల వివాదంపై వాటా ఫౌండేషన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
గచ్చిబౌలి భూముల్లోని అటవీ సంపద ధ్వంసం కాకుండా చూసి.. పర్యావరణాన్ని కాపాడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను బుధవారం (ఏప్రిల్ 2) విచారించిన హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి (ఏప్రిల్ 3) వరకు కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గానీ చేయొద్దంటూ ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ తదుపరి విచారణను బుధవారానికి (ఏప్రిల్ 3) వాయిదా వేసింది. దీంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.