లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న యూట్యూబర్ హర్షసాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హర్ష సాయి కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హర్షసాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఈ పిటీషన్ పై బుధవారం ( అక్టోబర్ 30, 2024 ) విచారణ జరిపిన హైకోర్టు హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు బాధితురాలు సిద్దమైనట్లు తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తూ... సెప్టెంబర్ 24, 2024 న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. హర్ష సాయితో పాటు అతడి తండ్రిపైన కూడా కంప్లైంట్ చేసింది బాధితురాలు.
Also Read :- నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో
ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి హర్షసాయి అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముందస్తు బెయిల్ మంజూరైన నేపథ్యంలో హర్షసాయి అజ్ఞాతం వీడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరి, తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారిన ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.