గ్రూప్​ 1 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​ : ఈ నెల 21 నుంచి మెయిన్స్​ 

గ్రూప్​ 1 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​ : ఈ నెల 21 నుంచి మెయిన్స్​ 

గ్రూప్​1 మెయిన్స్​కు అడ్డంకులు తొలగిపోయాయి.  తెలంగాణ హైకోర్టులో  దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో  ఈ నెల 21 నుంచి గ్రూప్​ 1 మెయిన్స్​  ఎగ్జామ్​ యథావిథిగా జరగనున్నాయి

తెలంగాణలోని గ్రూప్​ 1 అభ్యర్థులకు బిగ్​ రిలీఫ్ దొరికింది.  జూన్ 9న జరిగి ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని  దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ ఏడాది పిబ్రవరి 22న 563 పోస్టులకు టీజీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది.  జూన్​ 9న జరిగిన ప్రిలిమ్స పరిక్షకు 3.02 లక్షల మంది హాజరుకాగా.. 31,382 మంది మెయిన్స్​కు ఎంపికయ్యారు. 

Also Read:గ్రామాల్లోనూ విస్తరిస్తున్న గంజాయి కల్చర్

 గ్రూప్​1 మెయిన్​ ఎగ్జామ్​కు కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో  మెయిన్స్​ కు ఎంపికైన వారికి ఈ నెల 21 నుంచి 27 వరకు  మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు  ఎగ్జామ్​ నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది,  మెయిన్​ ఎగ్జామ్​ కు మొత్తం 6 పేపర్లు ఉండగా.. 150 మార్కులు ఉంటాయి.  గ్రూప్​ 1 మెయిన్స్​ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుందని ... తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్​ లో మాత్రమే  మెయిన్స్​ ఎగ్జామ్​ నిర్వహిస్తామని తెలిపింది టీజీపీఎస్సీ.

హాల్ టికెట్స్ విడుదల....

అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in  లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.