తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. సర్కారు భూముల అమ్మకాలను తప్పుబట్టలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయితే టెండర్లు, ఈ-వేలం వంటి పారదర్శక విధానాలను పాటిస్తూ భూముల విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని కోకాపేట, ఖానామెట్‌లో భూముల విక్రయాలకు గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ నేత విజయశాంతి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ప్రభుత్వం తమ భూములు అమ్ముకోకూడదని చెప్పేందుకు చట్టపరమైన నిబంధనేమిటో పిటిషనర్ తెలుపలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం తెలిపింది. చట్టాలను అనుసరిస్తూ, నిబంధనల మేరకు ప్రభుత్వం భూములు విక్రయించవచ్చునని పేర్కొంటూ విజయశాంతి పిల్‌పై ధర్మాసనం విచారణను ముగించింది.
ఇవి కూడా చదవండి:
బాక్సాఫీస్ దగ్గర సందడే సందడి
మంత్రి హరీష్రావుకు రఘునందన్ సవాల్