హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి ఫైనాన్షియర్స్ బాధితుల వివరాలు తెలుసుకునేందుకు మూడు వేర్వేరు భాషలకు చెందిన పత్రికల్లో నోటీసులు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో ప్రచారం జరిగేలా నోటీసులు ఇవ్వా లంది. మార్గదర్శి ఎవరికైనా సొమ్మును ఎగవేసిందో లేదో వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టాలంది.
అలాగే చందాదారుల వివరాలు మార్గదర్శి సంస్థ ద్వారా పెన్ డ్రైవ్ లో ఇవ్వాలని కోరుతూ ఓ అఫిడ విట్ దాఖలు చేయాలని పిటీషనర్ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు అదేశాలు ఇచ్చింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గద ర్శికి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ. తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామన రఫు రాజేశ్వర్ రావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
చట్ట నిబంధ నలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి. రామోజీ రావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018. డిసెంబర్ 31న తీర్పు చెప్పింది. ఈ తీర్చును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. గతఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.
అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడాను ప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024, ఏప్రిల్ 9న హైకోర్టు తీర్చును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ డిపాజిట్ల సేకరణకు సం బంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి. ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలంది.