హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు త్వరలోనే కొత్త న్యాయమూర్తులు రానున్నారు. 2025 జనవరి 11వ తేదీన సుప్రీంకోర్టు కొలిజియం భేటీ అయ్యింది. ఈ భేటీలో నలుగురు జిల్లా కోర్టు జడ్జిలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు కొలిజియం ఆమోదం తెలిపింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్‌రావు పేర్లను కేంద్రం ప్రభుత్వానికి కొలిజియం సిఫార్సు చేసింది.
కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నలుగురు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు. కాగా, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే బదిలీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆయననున బాంబై కోర్టు సీజేగా నియమించింది. ఆలోక్ అరాధే స్థానంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజయ్ పాల్ నియమితులయ్యారు.
ALSO READ | బీఆర్ఎస్ కాదు.. బీ‘ఆర్ఎస్ఎస్’: గులాబీ పార్టీకి సీఎం రేవంత్ కొత్త పేరు