Good News : పాస్ పోర్టు జారీపై హైకోర్టు సంచలన తీర్పు

పాస్పోర్ట జారీ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వ్యక్తిపై క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన పాస్పోర్టు పునరుద్దరణ ఆపకూడదని హైకోర్టు చీఫ్ జస్టిస్ సూరేపల్లి నంద పాస్ పోర్టు అథారిటీని ఆదేశించారు. పిటిషనర్ మంచిర్యాలకు చెందిన రావికంటి వెంకటేశం పాస్ పోర్టు దరఖాస్తును  వారంలోగా  ప్రాసెస్ చేయాలని ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి(RPO)ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.  

చీటింగ్ కేసులో కోర్టు విచారణలో ఉన్న వెంకటేశం తన పాస్ పోర్టును రెన్యూవల్ చేయాలని జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే క్రిమినల్ కేసులో వెంకటేశం ప్రమేయం ఉన్నందున ఆర్పీవో అతని దరఖాస్తును తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసూత్ వెంకటేశం నిబంధనలు, న్యాయానికి విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ కేసులో నందా తీర్పు చెబుతూ.. నేరం రుజువు అయ్యే వరకు ఒక వ్యక్తిని చట్టం నిర్దోషిగానే పరిగణిస్తుందని.. ప్రతి ఒక్కరికి ప్రయాణించే హక్కుతోపాటు పాస్ట్ పోర్టు పొందే హక్కు ఉందని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని ప్రస్తావించారు. 

అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నపుడు వ్యక్తికి ప్రయాణ హక్కుతోపాటు ప్రాథమిక స్వేచ్ఛల హక్కు  ఉంది. ప్రాథమిక హక్కులను గౌరవించడం ప్రాముఖ్యతను నొక్కిచెపుతూ ఈ తీర్పు చెప్పారు జస్టిస్ సూరేపల్లి నంద.