తుది తీర్పునకు లోబడే గ్రూప్1 నియామకాలు: హైకోర్టు

తుది తీర్పునకు లోబడే గ్రూప్1  నియామకాలు: హైకోర్టు
  • దివ్యాంగుల రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కోటా వివాదంలో హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రూప్‌‌‌‌‌‌‌‌-1 నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.   దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్‌‌‌‌‌‌‌‌-1 పరీక్షల నిలిపివేతకు నిరాకరించింది. 

ఈ నెల 21 నుంచి పరీక్షలు జరుగనుండటంతో అందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, టీజీపీఎస్సీని ఆదేశించింది. దివ్యాంగుల రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ చేస్తూ తీసుకువచ్చిన జీవో 29ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌లు దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పరీక్షలు ఈ నెల 21న ప్రారంభమవుతాయని, 3 నెలల్లో ఫలితాలు వెలువరిస్తామని టీజీపీఎస్సీ తరఫు లాయర్ వాదించడంతో ఈ దశలో పరీక్షలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని బెంచ్ పేర్కొంది.