హైడ్రా విధి విధానాలేంటి.?. కమిషనర్కు ఉన్న పరిధిలు ఏంటి.?:హైకోర్ట్

హైడ్రా విధి విధానాలేంటి.?. కమిషనర్కు ఉన్న పరిధిలు ఏంటి.?:హైకోర్ట్

 హైదరాబాద్ లో  అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటు చేసిన హైడ్రా విధివిధానాలను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికను హైడ్రాను  ఏర్పాటు చేశారో  చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

జన్వాడలోని ఫాంహౌస్ ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా..హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని  అడ్వకేట్  జనరల్ చెప్పారు.  హైడ్రా ఇండిపెండెంట్ బాడీ అని తెలిపారు.  అయితే  హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేస్తున్నారని పిటిషన్ తరపున కోర్టుకు వాదనలు వినిపించారు. ఆగస్టు 14న కొంత మంది అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్ కి వచ్చి కూల్చివేస్తామని బెదిరించారని చెప్పారు. ఇందులో వాటర్ వర్క్స్ తో పాటు సివేజ్ బోర్డును పార్టీలుగా చేర్చలేదని కోర్టుకు తెలిపారు. 

ఈ సందర్బంగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడాన్ని అభినందించిన హైకోర్టు..  హైడ్రా  పరిమితులు , హైడ్రా కమిషనర్ కు అధికారాలు ఏమిటో  చెప్పాలని ఆదేశించింది.  నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖనే  అనుమతులు ఇస్తుంది.. మరో శాఖ కూల్చివేస్తుంది. 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న బిల్డింగ్ ను హైడ్రా కమిషనర్ ఇప్పుడు కూల్చడమేంటి?. ఆగస్టు 22  వరకు జాన్వాడ ఫామ్ హౌస్ కూల్చి వేయొద్దు అని కోర్టు సూచించింది.తదుపరి విచారణను ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 నిముషాలకు వాయిదా వేసింది కోర్టు.