రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పరిధిలోని జూనియర్ విభాగంలో 150 మంది సివిల్ జడ్జీల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి. వయసు 23 ఏళ్ల నుంచి 35 ఏళ్లు కలిగి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా -వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500) చెల్లించాలి. స్క్రీనింగ్ పరీక్ష జూన్ 16న నిర్వహించనున్నారు. వివరాలకు www.tshc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.