
మల్టీప్లెక్స్ థియేటర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 16 ఏళ్ల లోపు పిల్లలకు అన్ని షోలకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది హైకోర్టు. ప్రీమియర్, బెనిఫిట్ స్పెషల్ షోలకు హైకోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణ మార్చి 17 కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
ఇటీవల స్పెషల్ షోలు, మల్టిఫ్లెక్స్ థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11గంటలలోపు అనుమతించవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ‘‘రాత్రి పడుకోవాల్సిన టైమ్లో సినిమాలు ఏంటి? అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత పిల్లలను రోడ్లపై తిరగడానికి తల్లిదండ్రులు ఎలా అనుమతిస్తారు? 16 ఏండ్లలోపు వారికి అర్ధరాత్రి దాటాక సినిమాలు, పబ్‌ల్లోకి అనుమతించరాదని ఉత్తర్వులివ్వాల్సి ఉంటుంది’’అని హెచ్చరించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ మల్టీఫ్లెక్స్ థియేటర్ల ఓనర్లు హైకోర్టులో అప్పీల్ చేశారు. దీని వల్ల థియేటర్ల యజమాన్యం నష్టపోతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. తాజాగా ఈ పిటిషన్ ను హైకోర్టు సవరించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది
పుష్ఫ ప్రీమియర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.