దిశ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలి

  • హైకోర్టులో వాదనలు.. విచారణ 9 కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: దిశ నిందితుల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుపై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ కేసులో దర్యాప్తు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగాలని.. బూటకపు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కేసు నమోదు చేయాలని అడ్వకేట్లు వాదించారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరణించిన వాళ్లపై కేసు నమోదు అయ్యాయని గుర్తుచేశారు. దిశ నిందితుల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలని, పోలీసులపై 302 సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం, ఇతర పిటిషన్లను చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె. శ్రీనివాసరావులతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారించింది.

పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయవాది బృందా గోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిర్పూర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివేదికను పరిశీలిస్తే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న పోలీసులు తప్పు చేశారని నిర్ధారణ అయ్యిందన్నారు. పోలీసులపై ఐపీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 302 కింద కేసు నమోదు చేయాలన్నారు. నిందితులు మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, చింతకుంట చెన్నకేశవుల్లో ముగ్గురు మైనర్లని, మైనర్లను జువనైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోంకు పంపాలని, జైలుకు కాదని చెప్పారు. నిందితుల కుటుంబాల తరపు న్యాయవాది వాదిస్తూ.. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని, పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడం అన్యాయమని తెలిపారు.

ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వ ప్లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరడంపై హైకోర్టు మండిపడింది. మంగళవారం విచారణ ప్రారంభమైన వెంటనే వాయిదా కోరకుండా ఇప్పుడు వాయిదా కోరడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

జూబ్లీహిల్స్​లో బ్లాస్టింగ్​పై విచారణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో కొండల రాళ్లను తొలగించేందుకు డే అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేలుళ్లు నిర్వహించడంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బ్లాస్టింగ్ పై ఓ పత్రికలో వచ్చిన వార్తను చదివిన హైకోర్టు జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భీమపాక.. దీనిపై హైకోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశారు. రోజుకు 10కి తగ్గకుండా పేలుళ్లు నిర్వహిస్తున్నారని, తొలగించిన రాళ్లను రాత్రిపూట రవాణా చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.

దీనివల్ల సమీపంలోని న్యాయవిహార్, భరణి లేఔట్, రామానాయుడు స్టుడియో పరిసరాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీన్ని పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణించిన హైకోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన భూగర్భ గనుల శాఖ, పర్యావరణ మంత్రిత్వశాఖ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ డైరెక్టర్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్, జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి నోటీసులు ఇచ్చింది.