జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణం, ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే అభియోగంపై సెప్టెంబర్ 12న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యశ్వంతాపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ కు చెందిన భూమిలో ఓ ఇంటి నిర్మాణం అక్రమమని, స్థల ఆక్రమణ జరిగిందని చర్యలు తీసుకోవాలని మధుసూధన్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.
Also Read :- మళ్లీ భారీ వర్ష సూచన
అయితే కమిషనర్ స్పందించకపోవడంతో మున్సిపల్ ముఖ్య కార్యదర్శి, శాఖ సెక్రటరీ, స్థానిక మున్సిపల్ కమిషనర్ మరొకరిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణకు మున్సిపల్ కమిషనర్ గై హాజరయ్యారు. దీంతో సెప్టెంబర్ 12న కోర్టులో హాజరు కావాలని జనగామ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు చేశారు. మున్సిపల్ చట్టం 2019ను అనుసరించి కమిషనర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కోర్టు సూచించింది.