ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే

  •   యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు
  •   నోటీసులివ్వకుండా ఎలా కూల్చేస్తారని హైడ్రాను ప్రశ్నించిన కోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చివేయాల్సి వచ్చిందని హైడ్రాను ప్రశ్నించింది. గతంలోనే యథాతథస్థితిని కొనసాగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా కూల్చివేతలు ఎలా చేపడతారని అడిగింది. కనీసం వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరా? అని ప్రశ్నించింది. 

హైడ్రా కూల్చివేతలను సవాలు చేస్తూ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీతంరెడ్డి శనివారం హైకోర్టులో హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వొకేట్ పి.శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ఆగస్టు 8న జారీ చేసిన ఉత్తర్వులు శనివారం ఉదయం 9.04 గంటలకు అందజేయడం చట్టవిరుద్ధమన్నారు. నిర్మాణాలన్నీ అక్కినేని నాగార్జున పేరిట పట్టా భూముల్లోనే ఉన్నాయన్నారు. తమ్మిడికుంట సర్వే నెం.36లో 20.07 ఎకరాల్లో ఉందని రెవెన్యూ రికార్డుల్లో ఉందని, బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9 మీటర్లలోనే ఉందన్నారు. దురుద్దేశపూరితంగా ప్రైవేటు సర్వే తమ్మిడికుంట 29 ఎకరాల్లోఉన్నట్టు, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 మీటర్లలో ఉందని పేర్కొందన్నారు. 

కొత్త సర్వే నివేదికను పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో సవాలు చేశారని, అది విచారణలో ఉందన్నారు. మరోవైపు ఈ స్థలం అయ్యప్ప సొసైటీలో ఉన్నందున లేఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రమబద్ధీకరణకు 2007లో దరఖాస్తు చేసుకోగా తిరస్కరించిందని, దానిపై కోర్టును ఆశ్రయించగా పునఃపరిశీలించాలని ఆదేశించిందన్నారు. మళ్లీ 2021లో ఉన్నట్టుండి కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దరఖాస్తును తిరస్కరించడంతో ప్రభుత్వం వద్ద అప్పీలు చేశామని, అక్కడ యథాతథస్థితి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఇవన్నీ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 200 మంది పోలీసు బలగంతో వచ్చి కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు. 

హైడ్రా చర్యలు చట్టబద్ధమే

హైడ్రా చర్యలు చట్టబద్ధమేనని ప్రభుత్వం తరఫు స్పెషల్​ అడ్వొకేట్ రాహుల్‌‌‌‌ రెడ్డి, హైడ్రా తరఫు అడ్వొకేట్​కటిక రవీందర్‌‌‌‌రెడ్డి వాదించారు. ఎన్‌‌‌‌ కన్వెన్షన్‌‌‌‌ కట్టడాలు అక్రమమని 30వ తేదీన నోటీసులు ఇచ్చామన్నారు. అవి ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో ఉన్నాయని ఈ నెల 8 నిర్ధారణ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. అక్రమ నిర్మాణాలు కాబట్టే కూల్చివేత చర్యలు చేపట్టినట్టు వివరించారు. చెరువు బఫర్‌‌‌‌ జోన్​ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఆధారాలు ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. రెండు పక్షాలు స్టేటస్‌‌‌‌కో ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. విచారణను సెప్టెంబర్‌‌‌‌ 9కి వాయిదా వేసింది.