విద్యుత్‌‌ సంస్థల్లో ప్రమోషన్లు ఆపండి

విద్యుత్‌‌ సంస్థల్లో ప్రమోషన్లు ఆపండి
  • హైకోర్టు స్టే ఆర్డర్‌‌

హైదరాబాద్, వెలుగు: జెన్‌‌ కో, ట్రాన్స్‌‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌‌ సంస్థల్లో స్టాఫ్‌‌కు ప్రమోషన్స్‌‌ ఇవ్వరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని విద్యుత్‌‌ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించరాదని జస్టిస్‌‌ నామవరపు రాజేశ్వర్‌‌రావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌‌ సంస్థలకు ఆదేశాలిచ్చారు. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్‌‌ 2 నుంచి ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించడంతో నష్టపోయిన ఓసీ, బీసీ ఉద్యోగులకు కూడా సీనియార్టీ మేరకు పదోన్నతులు కల్పించాలని 2018లో వెలువడిన ఉత్తర్వులపై రివ్యూ చేయాలన్న పిటిషన్లు పెండింగ్‌‌లో ఉన్నందున పిటిషనర్లకు ఏవిధమైన ఉత్తర్వులు జారీ చేయొద్దన్న ఆయా విద్యుత్‌‌ సంస్థలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. 

ఈ ఉత్తర్వులు వెలువడి ఏడేండ్లు అయ్యిందని, ఇప్పటి వరకు అమలు కాలేదని, రివ్యూ పిటిషన్‌‌పై తుది ఉత్తర్వులు వెలువడే వరకు పదోన్నతులు కల్పించరాదని తాజాగా తేల్చి చెబుతూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.