- హైకోర్టులో పిల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ జారీ చేసే జీవోలు, ఆర్డినెన్స్ లు తెలుగులో ఉండాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జీవోలు తెలుగులో ఉండాలంటూ 1980 లో వెలువడిన జీవోను అమలు చేయాలని శేరిలింగంపల్లికి చెందిన ఉమామహేశ్వరరావు వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుల బెంచ్ బుధవారం విచారించింది.
పిల్‌ను విచారణకు స్వీకరించే ముందు ప్రభుత్వ వివరణ నిమిత్తం నోటీసులిచ్చింది. తెలుగు మాట్లాడేవాళ్లు 70% ఉన్నారని, మిగిలిన 30% మందికి కూడా పూర్తిగా ఇంగ్లీషు రాదని పిటిషనర్ లాయర్ తెలిపారు. జీవోలు తెలుగులోనే ఉండాలంటూ 1980లో వెలువడిన జీవో అమలుకు ఉత్తర్వులివ్వాలని కోరారు. 30 ఏండ్ల నాటి జీవోపై ఇప్పుడు పిల్ దాఖలు చేయడమేంటని పిటిషనర్‌ను బెంచ్ ప్రశ్నించింది. 70 ఏండ్ల వయసులో ప్రచారం కోసం పిల్ వేయడం తగదని వ్యాఖ్యానించింది.