కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి మండలం రేకుర్తిలోని లయన్స్‌క్లబ్ ఐ హాస్పిటల్‌ను హైకోర్టు జడ్జి ఇ.వి.వేణుగోపాల్ ఆదివారం సందర్శించారు. హాస్పిటల్ చైర్మన్ కొండా వేణుమూర్తి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను చూపించారు. ఆసుపత్రి పర్ఫార్మెన్స్ చూసి ముగ్ధులై రూ.లక్ష విరాళంగా అందించారు.
మలేసియాలో స్థిరపడిన సైదం తిరుపతి, తెలంగాణ మలేషియా అసోసియేషన్ అధ్యక్షుడు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శులు ప్రకాశ్ హోళ్ల, అన్నారెడ్డి, ట్రస్ట్ సభ్యులు శరత్కృష్ణ, శివకాంత్, వినోద్ పాల్గొన్నారు.