పెండింగ్ లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేసి.. విధుల్లోకి తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యుషన్ ను తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. పీపీ పోస్టుకు అర్హులైనా పలువురు తమను విధుల్లోకి తీసుకుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీ శుక్రవారం కోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.
2021లో 152 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యుషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. 3200 మంది అభ్యర్థులు పీపీ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 132 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అయితే 132 మందిలో 92 మంది అభ్యర్థులను మాత్రమే పీపీ లుగా రిక్రూట్ చేసుకుంది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఇక క్వాలిఫై అయ్యిన తమను విధుల్లోకి తీసుకోవాలని 14 మంది అభ్యర్థులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను కోర్టు విచారించింది.4 వారాల్లో క్వాలీఫై అయిన అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది.