ముందైతే ఏపీలో రిపోర్ట్ చేయండి.. ఐఏఎస్లకు తేల్చి చెప్పిన హైకోర్టు

ముందైతే ఏపీలో రిపోర్ట్ చేయండి.. ఐఏఎస్లకు తేల్చి చెప్పిన హైకోర్టు

హైదరాబాద్: హైకోర్టులో క్యాట్ (Central Administrative Tribunal CAT) ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ముందు వెళ్లి ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్.. ఈ ఐఏఎస్లు CAT తీర్పు ప్రకారం ఏపీలో రిపోర్ట్ చేయడానికి ఇవాళే (అక్టోబర్ 16, 2024) డెడ్లైన్ కావడం గమనార్హం.

ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందేనని క్యాట్ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించాలని ఈ ఐఏఎస్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయ పడింది. సివిల్ సర్వెంట్స్ అయినంత మాత్రాన స్టే ఎలా ఇస్తామని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఐఏఎస్ల లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది.

ALSO READ | దక్కని ఊరట.. క్యాట్ నిర్ణయంపై హైకోర్టుకు ఐఏఎస్‎లు..!