
హైదరాబాద్: లగచర్ల, హకీంపేటలో భూ సేకరణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ భూములకు సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూసేకరణ నోటిఫికేషన్ లో 8 ఎకరాల వరకు ఉన్న భూసేకరణ ను ఆపాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉందని దుద్యాల తహసీల్దార్ కిషన్ తెలిపారు.
Also Read : కేటీఆర్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నరు
నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటి మంజూరుకు వికారాబాద్ కలెక్టర్రైతులకు హామీ ఇవ్వడంతో భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల , పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే పూర్తయింది. పోలేపల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.