హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులపై కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. HMDA పరిధిలోని FTL , బఫర్ల జోన్ లను నిర్దారించేవరకు చెరువుల పూర్తి పర్యవేక్షణ కోర్టు ఆధీనంలో ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 30లోగా చెరువులై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
HMDA పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని తెలిపిన ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయని వెల్లడించింది. ఇంకా 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు ఖరారు చేసేందుకు మూడు నెలల గడువు కావాలిని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 30 కి వాయిదా వేసింది.
ALSO READ | ప్రభుత్వానికి ఎందుకంత భయం? :-మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్