నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

తెలంగాణ హైకోర్టు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు..  బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కోవాలక్ష్మి,మాగంటి గోపినాథ్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 

కోవాలక్ష్మీకి వ్యతిరేకంగా  అజ్మీరా శ్యాం హైకోర్టులో పిటిషన్ వేయగా .. మాగంటి గోపినాథ్ పై ప్రత్యర్థులు అజారుద్దీన్, నవీన్ యాదవ్. కూనంనేని సాంబశివరావుపై నందూలాల్ అగర్వాల్ వేసిన పిటిషన్లను ఇవాళ జస్టిస్  కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.