తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు !

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో నెలకొని ఉన్న కోవిడ్ పరిస్థితులపై ఇవాళ విచారణ చేపట్టింది.  ఒమిక్రాన్ వైరస్ తీవ్రత దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్,న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఇతర పండుగల విషయంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సెలబ్రేషన్స్ పేరుతో జనం గుంపులు గుంపులుగా గుమి కూడాదని మూడరోజుల్లో ఆదేశాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని హైకోర్టు సర్కాకు చెప్పింది. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం 38 మంది ఒమిక్రాన్ వైరస్ బారిన పడ్డారు. టోలిచౌకి  పారామౌంట్ కాలనీ ఒమిక్రాన్ హాట్ స్పాట్ గా మారింది. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న విదేశీయులతో ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా ఇప్పటికే ఇతర దేశాల్లో లాక్ డౌన్ లు నడుస్తున్నాయి.  మనదేశంలో కూడా చాలా చోట్ల ఆంక్షలు అమలవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకూ బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా న్యూఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది కేజ్రీవాల్ సర్కార్. 

ఇవి కూడా చదవండి:

తెలంగాణ గ్రామంలో 10 రోజుల లాక్ డౌన్

8 నెలల గర్భంతో మతిస్థిమితం లేని యువతి