హైదరాబాద్: జన్వాడ ఫాం హౌజ్ కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైడ్రా ఏర్పాటు జీవో, ఏర్పాటుకు కారణాలను ఏఏజి కోర్టుకు వివరించారు. హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్లను కూల్చి వేసిందని, కూల్చివేతలకు హైడ్రాకు ఉన్న అధికారం ఏంటని -హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని కూల్చివేతలు చేస్తున్నామని ఏఏజి తెలిపారు.
Also Read :- ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
కూల్చివేతలకు ముందు ఎలాంటి లీగాలిటీస్ పాటిస్తున్నారని- హైకోర్టు అడగ్గా.. నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపడుతున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. అవసరమైతే హైడ్రా కమిషనర్ను కోర్టులో హాజరుకావాలని అదేశిస్తామని- హైకోర్టు స్పష్టం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని - అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. హైడ్రా తరపు న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జన్వాడ ఫాం హౌజ్ కూల్చివేతలపై వాదనలు జరిగిన తీరిది..
హైకోర్టు: జన్వాడ మున్సిపాలిటీ కిందకు వస్తుందా లేదా గ్రామ పంచాయితీకి వస్తుందా ?
ఏఏజి: నార్సింగ్ మున్సిపాలిటీకి వస్తుంది
పిటిషనర్ అడ్వకేట్: ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతి గ్రామ పంచాయితీ నుంచి తీసుకున్నాం
పిటిషనర్: 2014 సెప్టెంబర్లో నిర్మాణం చేశాం
హైకోర్టు: ఇరిగేషన్ అధికారులు FTL ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారా ?
హైడ్రా తరపు న్యాయవాది: జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలో రాకున్నా పార్టీ చేశారు
హైకోర్టు: జన్వాడ ఫామ్హౌస్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి
హైకోర్టు: ఫామ్హౌస్కు సంబంధించిన పత్రాలను హైడ్రా కమిషనర్ పరిగణనలోకి తీసుకొని పరిశీలించాలి.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో జీవో 111 నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఫామ్ హౌస్ కేటీఆర్‌దే కాదనేది బీఆర్ఎస్ వాదన. తాజాగా కూల్చివేతలతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.