మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే

మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే
  • నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలి: హైకోర్టు
  • హైడ్రా ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది
  • మూసీ ఏరియాలో సర్వే చేపట్టి బాధితులను గుర్తించాలి
  • ప్రభుత్వ విధానం మేరకు వారికి వసతి కల్పించాలి
  • సర్వేకు అధికారులు వస్తే ఎవరూ అడ్డుకోవద్దు
  • ఆక్రమణలోని ల్యాండ్స్​ పట్టా, శిఖం భూములైతే ముందుగా నోటీసులివ్వాలి
  • చట్ట ప్రకారం వారికి పరిహారం కూడా చెల్లించాలి
  • నదులు, చెరువులను ఆక్రమించుకున్నోళ్లపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు చేపట్టాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మూసీ రివర్​ బెడ్,  బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్​, ఎఫ్​టీఎల్​లో చట్టవిరుద్దంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాల్సిందేనని, అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. మూసీలోకి మురుగునీరు, కలుషిత నీరు చేరకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. మూసీ పునరుజ్జీవం వల్ల ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వాళ్లను సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా గుర్తించాలని, అలాంటి పేదలకు ప్రభుత్వ విధానం మేరకు సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని తెలిపింది. 

  ఆక్రమణలో ఉన్న భూములు పట్టా లేదా శిఖం భూములు అయితే అలాంటి వాళ్లకు ముందుగా నోటీసులు ఇవ్వాలని, చట్ట ప్రకారం పరిహారం కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా.. నదులు, చెరువులు, నీటి వనరులను ఆక్రమించుకున్న వారిపై తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ 1357, వాల్టా చట్టం కింద క్రిమినల్‌‌‌‌‌‌‌‌ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలను ఖాళీ చేయించడం, కూల్చివేత చర్యలు అన్యాయమంటూ దాఖలైన 46 పిటీషన్లపై ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పింది. కీలక గైడ్​లైన్స్​ను జారీ చేసింది. జస్టిస్‌‌‌‌‌‌‌‌ సి.వి. భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈ తీర్పును వెలువరించారు. ఆ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. 

సర్వేకు అధికారులు వస్తే అడ్డుకోవద్దు

ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌జోన్లను గుర్తించేదుకు సర్వే అధికారులు, సిబ్బంది వస్తే వాళ్లను పిటిషనర్లు, ప్రజలు అడ్డుకోరాదని హైకోర్టు ఆదేశించింది. సర్వేకు ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు కల్పించకూడదని, సహకరించాలని తెలిపింది. ‘‘హైకోర్టు ఉత్తర్వుల అమలు కోసం నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి. మూసీలోకి మురికినీరు రాకుండా చర్యలు తీసుకోవాలి. మూసీ బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్, ఎఫ్​టీఎల్, రివర్​ బెడ్‌‌‌‌‌‌‌‌ లోని ఆక్రమణదారుల అక్రమ నిర్మాణాలను తొలగించే సమయంలో  సుప్రీంకోర్టు గైడ్​లైన్స్​ను కచ్చితంగా అమలు చేయాలి” అని ఆదేశించింది. మూసీ పునరుజ్జీవం వల్ల ప్రభావితమయ్యే  వ్యక్తులకు సంబంధించి ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించాలని, ప్రభావితమయ్యే పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద అనువైన ప్రాంతంలో వసతి కల్పించాలని తెలిపింది. 2012 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ విధిగా అమలు చేయాలని..  చట్ట వ్యతిరేకంగా మూసీ నదిలో నిర్మాణాలు ఉన్నట్లయితే నిబంధనలకు తగ్గట్టు తొలగించాలని హైకోర్టు గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్​లో పేర్కొంది. 
 
గైడ్​లైన్స్​ కింది కోర్టులు ఫాలో కావాలి

మూసీ నదిలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసేముందు 2023లో తాము జారీ చేసిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని హైకోర్టు తెలిపింది. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వర్సెస్‌‌‌‌‌‌‌‌ ఫిలోమెనా ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. అక్రమణ నిర్మాణాల తొలగింపుపై స్టే, తాత్కాలిక ఇంజంక్షన్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసే ముందు హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ను కూడా కింది కోర్టులు ఫాలో కావాలని స్పష్టం చేసింది.  

ALSO READ : జనవరి ఫస్ట్ వీక్​లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురూ

నిజాం పాలనలో కీలక చట్టం

1908లో మూసీ వరదలు ముంచెత్తడంతో నాటి నిజాం పాలకులు జంట జలాశయాలను నిర్మించారని హైకోర్టు గుర్తుచేసింది. అప్పుడే ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ యాక్ట్‌‌‌‌‌‌‌‌–1317ను తెచ్చారని తెలిపింది. ‘‘రోడ్లు, బ్రిడ్జీలు, గుంతలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలపై సర్వహక్కులు ప్రభుత్వానివే. కొందరు చెరువులు, ట్యాంకులు, రివర్‌‌‌‌‌‌‌‌ బెడ్​లను ప్లాట్లుగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు.  చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో 2002లో వాల్టా చట్టాన్ని నాటి ప్రభుత్వం తెచ్చింది. ఈ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో వాచ్‌‌‌‌‌‌‌‌ కమిటీల ఏర్పాటుకు జీవో  386 తెచ్చింది” అని వివరించింది.

హైడ్రా ఏర్పాటు చట్టబద్ధమే

చెరువుల రక్షణ నిమిత్తం ప్రభుత్వం జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందని, ఇలా చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు పేర్కొంది. ‘‘తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. చట్ట ప్రకారం ప్రత్యేక అధికారాలను హైడ్రాకు ఇచ్చింది.  విధులు నిర్వహించడానికి ఏ అధికారినైనా ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 4 కింద అపాయింట్​ చేయొచ్చు. చెరువుల్లో ఇండ్ల పట్టాలు ఇచ్చినా వాటికి చట్టబద్ధత ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించింది” అని తెలిపింది.