మల్లారెడ్డి వర్సిటీ ఆఫ్ క్యాంపస్​పై చర్యలు తీసుకోండి : హైకోర్టు

మల్లారెడ్డి వర్సిటీ ఆఫ్ క్యాంపస్​పై చర్యలు తీసుకోండి : హైకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
  • ఆఫ్​ క్యాంపస్​ ఏర్పాటు యూజీసీ రూల్స్​కు విరుద్ధమని కామెంట్
  • విచారణ ఈ నెల 24కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మల్లారెడ్డి వర్సిటీ ఆఫ్ క్యాంపస్ సెంటర్​పై చర్యలు తీసుకోవాలని స్టేట్ గవర్నమెంట్​ను హైకోర్టు ఆదేశించింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ.. బాలానగర్​లో సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నవీన ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్​పై విచారించారు.

రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీ అనుమతుల్లేకుండా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేశారని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ హైకోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 25న హైకోర్టు జారీ చేసిన నోటీసులు ఇచ్చేందుకు మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు ఆఫ్ క్యాంపస్ సెంటర్​కు అడ్వకేట్ వెళ్లారన్నారు. అక్కడి సిబ్బంది నోటీసులు తీసుకోలేదని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని కోరారు. స్పందించిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి.. ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే యూజీసీ రూల్స్ ప్రకారం అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు.

ALSO Read :బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లు సింగరేణికే కేటాయించాలి: ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ శ్రేణులు

ఇదే విషయాన్ని ఏఐసీటీఈ, ఉస్మానియా యూనివర్సిటీలు కూడా ధ్రువీకరించాయని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన నోటీసులు వర్సిటీ అందుకోలేదని, విచారణకూ హాజరుకాలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఏర్పాటుకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఎలాంటి అనుమతి పొందలేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.