బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బక్రీద్ సందర్భంగా గోవధపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే జంతు వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్ట్ లు పెట్టామని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపు పై 60 కేసులు నమోదు చేశామని న్యాయస్థానానికి వెల్లడించారు.
ఎవరైనా జంతువుల అక్రమ వధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ముస్లింల ప్రధాన పండగలలో ఒకటి రంజాన్, రెండోది బక్రీద్.. ఈ పండగను17వ తేదీ (సోమవారం) జరుపుకోనున్నారు.