నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎందుకు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు?...పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని పార్కులో ఎందుకు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వచ్చిందని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఆయన పారిపోతాడని గానీ, దర్యాప్తునకు సహకరించలేదని గానీ ఆరోపణలు చేయలేదు కదా అని పేర్కొంది. ఇప్పుడు నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని విడుదల చేస్తే ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది. దర్యాప్తు చేయవద్దని కోర్టు చెప్పడం లేదని, రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి చట్టబద్ధంగా ఉందా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తోందని పేర్కొంది.

వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లగచర్లలో అధికారులపై రైతుల దాడి సంఘటనలో పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపుతూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పట్నం నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం విచారణ చేపట్టారు. పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. అక్టోబరు 25న నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై మరో కేసు నమోదైందని తెలిపారు. అక్టోబరు 27న ఒక సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రజలను రెచ్చగొట్టారన్నారు.

రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వచ్చినా.. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినా.. దాడి చేయాలంటూ రెచ్చగొట్టారని, దీనికి సంబంధించిన వీడియోను పరిశీలించాలని కోర్టును కోరారు. చట్ట ప్రకారమే అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినందున కింది కోర్టు రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అంతేగాకుండా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుల పరిష్కారం కోసం రూ.10 కోట్లు విడుదల చేశారని ఆరోపించారు. ఈ దశలో ఆయనను విడుదల చేస్తే దర్యాప్తు ముందుకుసాగదని, దీంతో పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, పిటిషన్లు దాఖలు చేసి చట్టపరమైన ప్రత్యామ్నాయాలు పొందే హక్కు పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉందని చెప్పారు.

రూ.10 కోట్లు కేటాయింపునకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు వాదనలు వినిపిస్తూ.. పోలీసులు మఫ్టీలో వచ్చి కేబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కులో నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని, అయితే, రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టులో మరో రకంగా పేర్కొన్నారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. పోలీసులు సమర్పించిన వీడియోలతో పాటు పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్పించిన ఆధారాలను పరిశీలించి తీర్పు వెలువరిస్తామని చెబుతూ.. విచారణను వాయిదా వేశారు.