
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేసేలా ఆదేశించాలంటూ ఎం.గణేశ్, భూక్యా భరత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరించారు.