సీఎంపై కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వలేం

సీఎంపై కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వలేం
  • బీఆర్ఎస్ నేత పిటిషన్​పై తేల్చిచెప్పిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై కేసు నమోదు చేయాలని తాము పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. కేసు నమోదు చేయాలని కోరిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిస్మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విచారణార్హత లేదని వెల్లడించింది.గత నెల 6న మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన సభలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలపై తీవ్ర విమర్శలు చేశారని..ఆయనపై ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పోలీసులు కేసు నమోదు చేయలేదని పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

దీన్ని జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి బుధవారం విచారించారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరపు న్యాయవాది వాదిస్తూ.. పాలమూరు సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్  అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదన్నారు. కేసు నమోదు చేసేలా అదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణార్హం కాదని పేర్కొంటూ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి. విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు.