- ఈడీ విచారణకు రాలేను
- క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది.. నాకు టైమ్ ఇవ్వండి
- ఫార్ములా– ఈ రేసు కేసులో ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్
- షెడ్యూల్ ప్రకారం నేడు విచారణకు వెళ్లాల్సి ఉండగా.. గైర్హాజరు
- ఫెమా ఉల్లంఘనలపై మరో కేసు ఫైల్?
- ఎఫ్‌ఈవో, ఏస్ నెక్స్ట్ జెన్‌కు నోటీసులు ఇచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్ కేసులో ఈడీ ముందు విచారణకు తాను రాలేనని కేటీఆర్ అన్నారు. ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన మంగళవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వచ్చేదుందని, దీంతో విచారణకు తాను రానంటూ సోమవారం సాయంత్రం ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ చేశారు. పంపారు. హైకోర్టు తీర్పును వెలువరించేంత వరకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. కేటీఆర్ వినతికి ఈడీ సానుకూలంగా స్పందించింది. గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. విచారణకు హాజరుకావల్సిన తేదీలపై మంగళవారం సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే.. ఇదే కేసులో బుధవారం బీఎల్‌ఎన్‌రెడ్డి, గురువారం అర్వింద్ కుమార్ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది.
ఫెమా ఉల్లంఘనలపై మరో కేసు!
ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనల కు సంబంధించి మరో కేసు నమోదు చేసేందుకు ఈడీ రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఫార్ములా– ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో), ఏస్‌నెక్స్ట్ జెన్ సంస్థల ఆర్ధికవాదేవీలపై ఈడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్‌యాక్ట్(ఫెమా) కింద మరో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఆర్బీఐ రూల్స్‌కు విరుద్ధంగా ఫార్ములా –ఈ రేస్ వ్యవహారంలో దేశం దాటి వెళ్లిన డబ్బుకు సంబంధించిన వివరాలను ఈడీ రాబడుతున్నది.
ALSO READ : లాయర్తోనే విచారణకు వస్త.. లేదంటే వెళ్లిపోత : కేటీఆర్
ఆ డబ్బు బిట్రన్‌లోని ఎన్ని అకౌంట్స్‌లో డిపాజిట్ అయింది? ఆయా కంపెనీల అకౌంట్స్ నుంచి మళ్లీ ఇండియాకు డబ్బులు తరలించారా? అనే కోణంలో ఆరా తీస్తున్నది. ఈ కేసులో కేటీఆర్, బీఎల్‌ఎన్‌రెడ్డి, అర్వింద్‌కుమార్ రికార్డు చేసి.. వాటి ఆధారంగా ఎఫ్‌ఈవో, ఏస్‌నెక్స్ట్‌జెన్ సంస్థలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.