సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్‌ఎస్ నేత కల్లకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు శుక్రవారం హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన కేటీఆర్, కేంద్రఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి, రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీవోలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేటీఆర్ ఎన్నిక చెల్లందంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్‌రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వెల్లడించారు
అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన నామినేషన్ డాక్యుమెంట్స్‌లో ఆయన కొడుకు కె. హిమాన్హు పేరిట ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. కేటీఆర్ ఎలక్షన్ అఫిడవిట్లో తనపై భార్య, మైనర్ కుమార్తెలే ఆధారపడ్డారని పేర్కొన్నారని, అయితే, గత ఏడాది జులైలో మేజర్ అయిన హిమాన్షు తనపై ఆధారపడలేదని కూడా చెప్పారని వివరించారు. హిమాన్షు సిద్ధిపేట మర్కూక్ మండలం వెంకటాపూర్‌లో నాలుగు 4 ఎకరాలు, ఎరబ్రల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు వరసగా రూ.10.50 లక్షలు, రూ.88 15 లక్షలు చెల్లించారని, కేటీఆర్ అర్థిక అండ లేకుండా ఇటీవలే మేజర్ అయిన కొడుకుకు అంత డబ్బు ఎలా వస్తుందన్నారు.
తండి ఆర్థిక సాయం లేకుండా అంత మొత్తాన్ని హిమాన్హు ఎలా చెల్లించగలరని ప్రశ్నించారు. ఎలక్షన్ అపిడవిట్లో నిజాలు చెప్పకుండా చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123కు విరుద్ధమని, రుక్మిణి మాదగౌడ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమన్నారు. వాదనల అనంతరం న్యాయమూర్తి, ప్రతివాదులైన కేటీఆర్, ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేశారు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.