పేదల ఇళ్లే కూలుస్తారా.. పెద్దల జోలికి వెళ్లరా..? హైడ్రాపై హైకోర్టు సీరియస్

పేదల ఇళ్లే కూలుస్తారా.. పెద్దల జోలికి వెళ్లరా..? హైడ్రాపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఫైర్ అయ్యింది. హైడ్రా కేవలం పేదల ఇళ్లే కాకుండా.. పెద్దల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చాలని చురకలంటించింది. హైడ్రా టార్గెట్‌ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్నించింది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీసింది. అక్రమణలకు పాల్పడిన పెద్దల భవనాలను కూల్చినప్పుడే భూములకు రక్షణ ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత ఉంటుందని పేర్కొంది.

 కాగా, మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యాజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై బుధవారం (మార్చి 19) హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కేవలం పేదల ఇళ్లే కాకుండా.. పెద్దల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చాలని మొట్టికాయలు వేసింది. హైడ్రా టార్గెట్‌ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్నించింది.

ALSO READ | గ్లోబల్​ సిటీగా హైదరాబాద్..ట్రిలియన్ ఎకానమీ వైపు అడుగులు

 మియాపూర్‌, దుర్గం చెరువు ఆక్రమణ పరిస్థితి ఏంటీ..? దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని అక్రమణలను ఎందుకు తొలగించట్లేదని హైడ్రాను నిలదీసింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమైనా.. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొంది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని.. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత ఉంటుందని నొక్కి చెప్పింది. అలాగే.. ‘మీరాలం’లో ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆదేశించిన హైకోర్టు.. మీరాలంలో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు సూచించింది.