సంతోషంగా లేము.. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి..

సంతోషంగా లేము.. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి..

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై సంతోషంగా లేమని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కూల్చివేతలు ఇలాగే కొనసాగిస్తే జీవో 99పై స్టే విధించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. 

పొలిటికల్ బాసులను సంతృప్తిపరిచేందుకు కూల్చివేతలు చేపట్టొద్దని, కూల్చివేతల్లో ప్రతి దశలో ఉల్లంఘనలు ఉన్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైడ్రా కూల్చివేతలు తప్ప ఏం చేయట్లేదని చెప్పింది. హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణకు వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది.. అవేంటంటే..

* గతంలో అన్ని పర్మిషన్లు ఇచ్చిన కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎంఆర్ఓలపై క్రిమినల్ కేసులు ఫైల్ చేశారా..?
* ఆదివారం రోజు ఫ్యామిలీతో గడపకుండా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి..?
* ఆదివారం రోజు వచ్చి అంత హడావిడిగా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముంది..?
* HYDRAA చేసే కూల్చివేతలతో హైకోర్టు సంతోషంగా లేదు
* కోర్టు ఆదేశాలు ఉన్న తర్వాత,ఆదివారం రోజు కూల్చివేతలు ఎలా చేపడతారు..?
* వీకెండ్స్ ,రాత్రి పూట కూల్చివేతలు చేయొద్దు అని కోర్టు ఆదేశాలు ఉన్నాయి, వాటిని ఎందుకు పట్టించుకోలేదు..?
* ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారో కనీసం విచారణ ఎందుకు చెయ్యడం లేదు..?
* 2500 లేక్స్ ఉంటే,ఇప్పటి వరకు ఎన్ని లేక్స్ కు FTL ఫిక్స్ చేశారు అని రంగనాథ్కు కోర్టు ప్రశ్న
* స్థానిక MRO కూల్చివేతకు అవసరమైన సామగ్రిని అడిగితే, తాము ఇచ్చామని అమీన్పూర్ కూల్చివేతలపై రంగనాథ్ వివరణ

Also Read : హైడ్రా కమిషనర్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు