తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసొసియేషన్, మహిళా కమిషన్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగచైతన్య, శోబితల విడాకులపై జోతిష్యం చెప్పినందుకు వేణు స్వామిపై మహిళా కమీషన్ కు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే..దీనిపై వేణుస్వామిని వివరణ కోరుతూ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 28న పిటిషన్ ను విచారించిన హైకోర్టు మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్, మహిళా కమీషన్ కు మొట్టికాయలు వేసింది.
నాగచైతన్య- శోభిత నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి తెరలేపారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనిపై తెలుగు ఫిలీం జర్నలిస్ట్ అసొసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయగా..వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు.