హైదరాబాద్: ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యాంకు హైకోర్టులో చుక్కెదురైంది. BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. కోవా లక్ష్మీ ఎన్నిక చెల్లదని అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
కోవా లక్ష్మి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, తన ఎన్నిక చెల్లదని అజ్మీర శ్యామ్ హైకోర్టును ఆశ్రయించారు. కోవా లక్ష్మి 2023 ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని పిటిషన్ దాఖలు చేశారు. అజ్మీర శ్యామ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు చివరకు అజ్మీర శ్యామ్ పిటిషన్ను కొట్టివేసింది.