హైకోర్టులో వనమాకు చుక్కెదురు.. ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టేకు నో

 

  • హైకోర్టులో వనమాకు చుక్కెదురు
  • ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టేకు నో
  • చట్టవిరుద్ధమైన చర్యను కొనసాగించలేమని కామెంట్​
  • మధ్యంతర పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు రెండోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తిగిలింది. 2018 ఎన్నికల్లో అఫిడవిట్‌‌‌‌లో తప్పుడు వివరాలిచ్చారని నిర్ధారించి ఆయన ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌ను కొట్టేస్తూ జస్టిస్‌‌‌‌ జి.రాధారాణి గురువారం తీర్పు చెప్పారు. మంగళవారం వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌‌‌‌ చేసే వరకు ఆ తీర్పు అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చట్టవిరుద్ధమైన చర్యను కొనసాగించలేమని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పులో ఆయనకు జైలు శిక్ష విధించలేదని గుర్తుచేసింది. అదే రోజు తీర్పు ప్రతిని అందుబాటులో ఉంచినందున, తీర్పు నిలిపివేతకు ఆస్కారమే లేదని స్పష్టం చేసింది. తీర్పు నిలిపివేతకు ఎలాంటి కారణం లేదంది. డిసెంబరులో ఎన్నికలు వస్తున్నందున తనకు నష్టం వాటిల్లుతుందన్న ఒక్క కారణం మినహా తీర్చు అమలును నిలిపివేయాలని కోరడానికి వనమాకు కారణమేలేదంది. 

ఆస్తుల వివరాలు వెల్లడించకుండా అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంగా కొత్తగూడెం సెగ్మెంట్​ ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నెల రోజులు నిలిపి వేయాలని వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. 3 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరణంలో తీర్పు తనకు తీరని నష్టం చేకూరుస్తుందని, సుప్రీంకోర్టులో అప్పీల్‌‌‌‌ దాఖలు చేసే వరకు తీర్పు అమలును నిలిపివేయాలని పిటిషనర్‌‌‌‌ వాదనను తోసిపుచ్చింది. తప్పుడు వివరాలతో అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని తగిన ఆధారాలతో రుజువైనందున తీర్పుపై స్టే అవసరం లేదని జలగం వెంకట్రావు ప్రతివాదన. ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్‌‌‌‌ 116 (బి) ప్రకారం తీర్పు అమలును నిలిపివేయడానికి సరైన కారణాలు లేవని కూడా చెప్పారు. ఇది ఇద్దరి మధ్య వివాదం కాదని, ప్రజాస్వామ్య వ్యవహారమని మరో ప్రతివాది వాదన. అయితే తీర్పు అమలును నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు లేవని హైకోర్టు తేల్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో తమ తీర్పు ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

ALSO READ:సీనియర్ సిటిజన్లే .. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇక స్పీకర్​దే నిర్ణయం

వనమా దాఖలు చేసిన మధ్యంత పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అందరి చూపు స్పీకర్​ వైపు మళ్లింది. వనమా సుప్రీం కోర్టులో అప్పీల్ ​చేసినా అది విచారణకు రావడానికి కొంత టైం పడుతుంది. ఈలోపు కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్ల దు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అధికారికంగా అసెంబ్లీ సెక్రటరీకి పంపాల్సి ఉంటుంది. దానితో పాటు వనమా అప్పీల్​పై స్టేను నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాల కాపీని అధికారికంగా సర్క్యులేట్​చేయాలి. తీర్పు కాపీలు అందిన తర్వాత అసెంబ్లీ సెక్రటేరియెట్​వాటిని స్పీకర్​ముందు పెడుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎంత మంది ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు రద్దు అయ్యాయి.. కోర్టు తీర్పుల విషయంలో స్పీకర్లు ఎలా స్పందించారు అనే వివరాలు కూడా సమర్పిస్తుంది. ఈ అంశాలన్ని పరిశీలించిన తర్వాతే స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారని ఆయన ఆఫీసు వర్గాలు వెల్లడించాయి.