ఖురాన్‌‌ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించింది

 ఖురాన్‌‌ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించింది
  • ఇబాదత్‌‌ఖానాను స్వాధీనం చేసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: దారుల్‌‌షిఫా ఇబాదత్‌‌ఖానా  స్వాధీనం వ్యవహారంలో ఖురాన్‌‌  స్ఫూర్తిని వక్ఫ్‌‌ బోర్డుతోపాటు రివ్యూ పిటిషనర్‌‌  విస్మరించారని హైకోర్టు తప్పుబట్టింది. ఇబాదత్‌‌ఖానాను స్వాధీనం చేసుకుని షియా, ఇమామియా, ఆషరీ, అక్బరీ, ఉసులీలు అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలని గత ఏడాది ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు వక్ఫ్‌‌ బోర్డు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్‌‌  పనితీరు ఉందని వ్యాఖ్యానించింది. 

ఇబాదత్‌‌ఖానాకు 10 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ 2023లో వక్ఫ్‌‌ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ గత కమిటీ సభ్యుల్లో ఒకరైన మీర్‌‌  హస్నయిన్‌‌  అలీఖాన్‌‌  రివ్యూ పిటిషన్‌‌  దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌  నగేశ్‌‌  భీమపాక విచారణ చేపట్టి  గురువారం తీర్పు వెలువరించారు.