అర్చకుల బదిలీలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది

  • అర్చకుల ట్రాన్స్​ఫర్లపై స్టే
  • ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లోని అర్చకులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు  స్టే ఇచ్చింది. రాష్ట్రంలోని ఆలయాల్లో అర్చకుల బదిలీ నిమిత్తం ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కోరుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కె. శ్రీమన్నారాయణాచార్యులు మరొకరు వేసిన పిటిషన్లను జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుల్లా కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టారు. 

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం మతపరమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపారు. ఆలయ నిర్వహణ, పరిపాలనను మాత్రమే పర్యవేక్షించాల్సిన ప్రభుత్వం తన పరిధి దాటి వ్యవహరిస్తోందన్నారు. అర్చకులను ఉద్యోగిగా పరిగణిస్తూ బదిలీకి ప్రయత్నాలు చేయడం చెల్లదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, అర్చకుల బదిలీ ప్రక్రియపై స్టే విధించింది.