దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: హైకోర్టులో పోలీసులకు ఊరట

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: హైకోర్టులో పోలీసులకు ఊరట

దిశా నిందితుల ఎన్ కౌంటర్ కేసులో  పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్కర్  కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసులో అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధించింది హైకోర్టు. 

దిశ ఎన్ కౌంటర్ కేసులో  పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని  సిర్పూర్కర్ కమిషన్ సూచించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ రిపోర్టుపై  ఏడుగురు పోలీసులు,  షాద్ నగర్ తహసిల్దార్ హైకోర్టును ఆశ్రయించారు.  సిర్పూర్కర్  కమిషన్ నివేదిక సరిగ్గా లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఇవాళ విచారించిన హైకోర్టు.. కమిషన్ నివేదిక సరిగా లేదని స్టే విధించింది.  షాద్ నగర్ తహసీల్దార్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.