నీట్ ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్: నీట్ ఎంబీబీఎస్ స్థానికత అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణలో పర్మినెంట్ అడ్రస్ ఉన్నవారందరిని లోకల్ అభ్యర్థులుగా పరిగణించి అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో లోకల్ ఉన్నవారిని నాన్ లోకల్ గా ఎలా పరిగణిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. స్థానికులు, స్థానికేతరులకు రూల్స్ రూపొందిం చాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.