వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. నిందితుడికి బెయిల్

ఏపీలో  సంచలనం సృష్టించిన వైఎస్ వివేక్ హత్య కేసులో నిందితుడికి బెయిల్ మంజూరయ్యింది.   నిందితుడు  ఉదయ్‌ కుమార్‌ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు  చేసింది . వారంలో ఒకరోజు పులివెందుల పోలీసుల ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 

2019 ఎన్నికలకు ముందు పులివెందుల నివాసంలో వైఎస్‌ వివేకా దారుణ హత్య ఏపీ వ్యాప్తంగా కలకం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేయగా, పలువురు బెయిల్ పై ఉన్నారు.ఈ కేసులో కీలక నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. 

 వివేక్ హత్య  కేసులో భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్  తో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు.  సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో మొత్తం 23 మంది నిందితులుగా చేర్చింది.