10 మంది పిటిషనర్లలో ఒక్కరూ.. హాల్ టికెట్ సబ్మిట్ చేయలే

10 మంది పిటిషనర్లలో ఒక్కరూ..  హాల్ టికెట్ సబ్మిట్ చేయలే
  • డీఎస్సీ వాయిదా కేసులో హైకోర్టు అభ్యంతరం
  •  తదుపరి విచారణ 28కి వాయిదా

హైదరాబాద్: డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ 10 మంది పిటిషన్ దాఖలు చేసి, వారిలో ఒక్కరు కూడా తమ హాల్ టికెట్ ను సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాదనలు సాగాయి. నిరుద్యోగుల తరఫున అడ్వొకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు.  నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహణ వరకు నాలుగు నెలల సమయం మాత్రమే ఇచ్చారని బెంచ్ కు తెలిపారు. 

అడిషన్ అడ్వొకేట్ జనరల్ రజినీకాంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ..ఈ నాలుగు నెలల వ్యవధిలో నిరుద్యోగులు అనేక పరీక్షలు రాశారని చెప్పారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. పది మంది కోసం 2.45 లక్షల మందిని బలిచేయలేమని పేర్కొన్నారు. పిటిషన్ వేసిన వారు పరీక్షకు దరఖాస్తు చేశారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్ –1 తోపాటు డీఏవో, డీఎస్సీ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకున్నారని రవిచందర్ బెంచ్ కు తెలిపారు. పది మంది డీఎస్సీకి దరఖాస్తు చేసుకుంటే ఒక్కరూ హాల్ టికెట్ సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేసు విచారణను 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.