స్వార్జిత ఆస్తిని పిల్లల్లో ఎవరికైనా గిఫ్ట్‌గా ఇచ్చే అధికారం తల్లికి ఉంటుందని హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు ఎలాంటి హక్కులు కోరడానికి వీలుండదని చెప్పింది.
హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్, వెలుగు: స్వార్జిత ఆస్తిని పిల్లల్లో ఎవరికైనా గిఫ్ట్‌గా ఇచ్చే అధికారం తల్లికి ఉంటుందని హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు ఎలాంటి హక్కులు కోరడానికి హక్కులు ఉండవని చెప్పింది. ఆస్తిపై హక్కులను ఆధారాలతో కోరాలని, అంతేగానీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో, ఊహాజనిత కారణాలతో కోరడానికి వీల్లేదని తెలిపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటిలో మూడో వంతు వాటా ఇవ్వకుండా పెద్దకుమారుడి పేరుతో గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్ చేయడాన్ని గతంలో సివిల్ కోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ బజరంగ్‌లాల్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ ఎం.జి.ప్రియదర్శినితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపి పైతీర్పు చెప్పింది.
తల్లి కొన్న ఆస్తిపై కొడుకులకు హక్కు లేదు
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1988లో తండ్రి ఇంటిని కొనుగోలు చేసి తల్లి పేరుతో రిజిస్టర్ చేశారన్నారు. దీన్ని తల్లి మొదట ముగ్గురికి పంచుతూ విల్ డీడ్ చేశాక తర్వాత దానిని రద్దు చేసి పెద్ద కొడుకుకు గిఫ్ట్ డీడ్ చేశారని చెప్పారు. ఇది కుటుంబ ఆస్తి అని అందులో మూడో వంతు తనకూ కేటాయించాలన్నారు. తల్లి సుశీల్ అగర్వాల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సొంతంగా కొనుగోలు చేశారని, ఇందులో కొడుకులకు ఎలాంటి హక్కు లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, తల్లి సుశీల్‌అగర్వాల్ ఆస్తి నుంచి మూడో వంతు వాటా అడుగుతున్న పిటిషనర్ బజరంగ్‌లాల్ అగర్వాల్ భిన్నమైన వాదనలు చేశారని తప్పుపట్టింది.
ALSO READ : నిలోఫర్లో ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్ మెంట్
విల్ డీడ్‌లో ముగ్గురికి వాటాలు ఇచ్చినపుడు తల్లికి హక్కులున్నాయని పిటిషనర్ అంగీకరించారు. గిఫ్ట్ డీడ్ చేశాక తల్లికి హక్కులు లేవనే వాదన చేశారు. ఇది కుటుంబ ఉమ్మడి ఆస్తి అని, తల్లి కనిపించే యజమానిగా మాత్రమే ఉన్నారని పిటిషనర్ పేర్కొంటున్నప్పుడు మొదట విల్ డీడ్ చేసినపుడే ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నించింది. విల్ డీడ్ చేసినప్పుడు దాన్ని రద్దు కోరకుండా గిఫ్ట్ డీడ్ చేశాక తల్లికి హక్కులు లేవని హైకోర్టు రావడం చెల్లదని పేర్కొంది. గిఫ్ట్ డీడ్ రద్దు కోరడం చెల్లదని చెప్పింది. పిటిషనర్ ఈ ఆస్తిని ఉమ్మడి కుటుంబ ఆస్తిగా ప్రకటించాలన్న అభ్యర్థనే చేయలేదని గుర్తు చేసింది. పరస్పర భిన్నమైన ప్రకటనలతో అదృష్టాన్ని పరీక్షించుకునేలా దావాను వేశారని తప్పుపట్టింది. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది.