హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ బలోపేతానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలకు అనుగుణమైన సిలబస్ తయారీ, టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, పరిశోధనలు, ఫ్యాకల్టీ , ఇంటర్న్ షిపులు, స్కిల్ డెవలప్ మెంట్, ఇన్నోవేషన్ ఏకోసిస్టమ్, ఫీడ్ బ్యాక్ మెకానిజం, విద్యాసంస్థల్లో ఫెసిలిటీస్ తదితర అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరారు.
కౌన్సిల్ వెబ్ సైట్ https://tgche.ac.in లో సూచనల కోసం గూగుల్ ఫామ్ పెట్టామన్నారు. విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు సూచనలు ఇవ్వాలన్నారు. కౌన్సిల్ లో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు.