![Telangana Beer Prices: వీకెండ్ కదా.. బీరేసి చిల్ అవుతారా.. ఒక్కసారి ఈ రేట్లు చూడండి..!](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-hikes-beer-prices-by-15-per-cent-here-is-the-full-list_ZR8JPd3byl.jpg)
హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు. మద్యం ప్రియులకు పండగ రోజు వచ్చినట్టే. ఉద్యోగులు వారంలో ఐదు రోజులు ఆఫీస్లో పడిన ఆపసోపాలన్నింటినీ, వ్యాపారులైతే బిజినెస్లో లాభనష్టాలను లైట్ తీసుకుని చిల్ మూడ్లో ఉంటుంటారు. ఫ్యామిలీతో సినిమాలు, షికార్లతో ఎంజాయ్ చేస్తూ గడిపేది కొందరైతే, ఫ్రెండ్స్తో వీకెండ్ పబ్లకు, పార్టీలకు వెళ్లి చిల్ అయ్యేది మరికొందరు.
కానీ.. ఈ వీకెండ్ అలా చిల్ అవ్వాలని చూస్తున్న మద్యం ప్రియులకు తెలంగాణలో పెరిగిన బీర్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. బీర్లు కేసులు కేసులు తాగే మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. చిన్న బీర్లు, పెద్ద బీర్లు అనే తేడా లేకుండా, ఈ బ్రాండూ.. ఆ బ్రాండనే వ్యత్యాసం లేకుండా బీర్ల ధరలు భారీగా పెరిగాయి.
కింగ్ ఫిషర్ బీర్లు మొదలుకుని బడ్వైజర్ బీర్ల దాకా అన్ని బ్రాండ్ల బీర్ల ధరలు పెరిగాయి. హైదరాబాద్లో వైన్ మార్ట్, లిక్కర్ బ్యాంక్ వంటి లిక్కర్ స్టోర్స్ లోపల పెరిగిన బీర్ల ధరల బోర్డును పెట్టేశారు. ఎంత పెరిగిందో, ఏంటో అనే గందరగోళానికి తావు లేకుండా బీరు ప్రియులు ఈ బోర్డు మీద ఉన్న ధరలు చూసి డిసైడ్ అవ్వొచ్చు. ఏ బీరు తాగాలో, అసలు ఏ బీరూ కొనకుండా జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ బయటకు వెళ్లిపోవాలో మద్యం ప్రియులు ఈ బోర్డ్ చూసి ఫిక్స్ అవ్వొచ్చు. తెలంగాణ అంతటా దాదాపు ఇవే రేట్లు వర్తిస్తాయి. ఒక్కసారి ఈ బోర్డుపై ఉన్న బీర్ల ధరలు చూద్దాం..
తెలంగాణలో పెరిగిన బీర్ల ధరల వివరాలు:
* కింగ్ ఫిషర్ లైట్ బీర్-రూ.180, కింగ్ ఫిషర్ లైట్ చిన్న బీర్-రూ.120
* కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్-రూ.190
* కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్-రూ.250
* కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ బీర్-రూ.260
* కింగ్ ఫిషర్ అల్ట్రా వైట్ బీర్-రూ.370
* హైన్ కెన్ బీర్-రూ.270
* గ్రీన్ బీర్--రూ.180
* బడ్ వైజర్ బీర్-రూ.250, బడ్ వైజర్ చిన్న బీర్-రూ.140
* బడ్ వైజర్ మ్యాగ్నమ్ బీర్-రూ.260
* హేవర్డ్స్ 5000 బీర్-రూ.190
* నాక్ ఔట్-రూ.190
* ట్యూబర్గ్ లైట్-రూ.180
* ట్యూబర్గ్ స్ట్రాంగ్-రూ.190
* ట్యూబర్గ్ క్లాసిక్-రూ.260
* కార్ల్స్ బర్గ్ స్మూత్-రూ.230
* కార్ల్స్ బర్గ్ స్ట్రాంగ్-రూ.220
* బీరా బ్లండ్ బీర్-రూ.250
* బీరా గోల్డ్ వీట్-రూ.330
* బీరా రైజ్-రూ.260
రానున్నది వేసవికాలం కావడంతో బీర్ల సేల్స్ మరింత పెరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా రానుంది. దీంతో ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీర్ల రేట్లు పెరగడంతో ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనాల్లో ఉన్నారు.