తెలంగాణ హోంమంత్రికి కరోనావైరస్

తెలంగాణ హోంమంత్రికి కరోనావైరస్

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా సోకింది. ఆయన కొన్ని రోజులుగా హోంక్వారంటైన్ లో ఉన్నారు. ఆయన సిబ్బందిలో కొంతమందికి ఇటీవలే కరోనా నిర్దారణ అయింది. దాంతో ఆయన కూడా మూడు రోజుల కింద కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో మహమూద్ అలీకి కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. దాంతో ఆయన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స చేరి పొందుతున్నారు. మహమూద్ అలీతో పాటు ఆయన మనవడికి కూడా కరోనా సోకినట్లు తేలింది. మహమూద్ అలీ ఈ నెల 25న గోషా మహల్ స్టేడియంలో హరితహారం కార్యక్రమంలో పాల్గాన్నారు. ఇదే కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ లు కూడా పాల్గొన్నారు. దాంతో వారు కూడా ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్యెల్యేలకు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

For More News..

హైదరాబాద్ లో వైరల్ అవుతున్న కరోనా డెడ్ బాడీల ఫేక్ న్యూస్

హైదరాబాద్లో.. మళ్లీ లాక్డౌన్! అన్నీ సిద్ధం చేయాలని సీఎం సూచన

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు