
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ కు భారీ స్పందన వచ్చింది. జిల్లా కేంద్రాలు, హెడ్ ఆఫీసులో 50 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈ నెల 1న నోటిఫికేషన్ రిలీజైంది. దరఖాస్తులను అప్లై చేసుకునేందుకు ఈ నెల 10 వరకు గడువు ఇవ్వగా.. 900 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
అభ్యర్థులకు త్వరలో రాతపరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ ఎల్టీసీ ఎంఐఎస్ స్పెషలిస్ట్ (స్టేట్ లెవెల్ టెక్నికల్ సెల్), సీఎల్ టీసీఎంఐఎస్ స్పెషలిస్ట్ (సిటీ లెవెల్ టెక్నికల్ సెల్), డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు ఎంపికైన వారితో ఇండ్ల స్కీమ్ లబ్ధిదారులకు నగదు బదిలీతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన ఆన్ లైన్, టెక్నికల్, ఐటీ పనులు నిర్వర్తించనున్నారు.