మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం

రాయికల్, వెలుగు :  జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వస్తాపూర్​లో సోమవారం షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు కాలిపోవడంతో అందులో ఉన్న సంకే చిన్న భూమయ్య (37) సజీవ దహనమయ్యాడు..దసరా పండుగ సందర్భంగా భూమయ్య భార్య లక్ష్మి తన పిల్లలను తీసుకుని పుట్టినిల్లయిన సారంగాపూర్​ మండలంలోని రేచిపల్లికి వెళ్లింది. భూమయ్య  మద్యం తాగి వచ్చి  ఇంట్లో పడుకున్నాడు. 

అర్ధరాత్రి వేళలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలంటుకున్నాయి. భూమయ్య మత్తులో ఉండి నిద్రలేవకపోవడంతో తప్పించుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో పడుకున్నవాడు పడుకున్నట్టే సజీవ దహనమయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.